- Advertisement -
సీఎం కేసీఆర్పై బీజేపీ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన రాష్ట్రం పై కనీస అవగాహన లేని నేతను అధ్యక్షుడుగా నియమించడం దురదృష్టకరం అన్నారు.
బీజేపీ నేతల పై ఇప్పటి వరకు అరెస్టులు-కేసులు పెట్టలేదని… కేంద్ర ప్రభుత్వం పై పూర్తిగా బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరోజు బేబీ మాత్రమేనని.. కేసీఆర్ చెప్పిన లెక్కలకు అమిత్ షా నే మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. అమిత్ షా తో పోల్చితే సంజయ్ పిల్లవాడని.. బండి సంజయ్ నిధుల పై లెక్కలు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలన్నారు. అవగాహనతో మాట్లాడితే ఆయనకే మంచిదని లేదంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని చెప్పారు.
- Advertisement -