అర్హత ఉన్నవారందరికీ పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి

283
errabelli dayakarrao
- Advertisement -

రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్లందరికీ కూడా పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పెన్షన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఎర్రబెల్లి..ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో 57 ఏళ్ల వయసువారందరికి పెన్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు.

తెలంగాణలో మొత్తం పింఛన్‌దారులు 38 లక్షల 77 వేల 717 మంది ఉన్నారని తెలిపిన ఎర్రబెల్లి…. పింఛన్ల రూపంలో వీరికి ప్రతి నెల రూ. 879 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల వయస్సు 65 నుంచి 57 ఏళ్లు చేస్తే అదనంగా మరో 6 లక్షల 62 వేల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ఆసరా పెన్షన్‌లలో కేంద్రవాటా కేవలం రూ. 203 కోట్లు మాత్రమేనన్నారు.

ప్రస్తుతం కళ్లుగీత కార్మికులు, వృద్ధులకు, వికలాంగులకు, హెచ్‌ఐవీ, వితంతువులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తింపచేస్తున్నామని తెలిపారు ఎర్రబెల్లి.

- Advertisement -