అన్నపూర్ణ జలాశయం..నీటి విడుదల

359
annapurna reserviour
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ రిజర్వాయర్ వెట్ రన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి ( అన్నపూర్ణ ) రిజర్వాయర్ లోకి నాలుగవ పంప్ ద్వారా 2830 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు.

మూడు రోజుల క్రితం మూడున్నర టీఎంసీల సామర్ధ్యమున్న ఈ ప్రాజెక్టులోకి ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టు 10 వ ప్యాకేజీ మిడ్ మానేరు నుంచి అనంతగిరి జలాశయానికి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ఇక్కడ రిజర్వాయర్ నిర్మించారు. ఇక్కడి నుంచి రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని ఎత్తిపోయనున్నారు.

- Advertisement -