చిరు కోసమే చేశా- రెజీనా

319
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా ఓ ఐటెం సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే. రెజీనాలో మంచి డాన్సర్ ఉందంటూ చిరంజీవి కితాబిచ్చినట్లుగా కూడా ఆమద్య వార్తలు వచ్చాయి. ఐటెం సాంగ్ ను ముందే చిత్రీకరించడంతో అందరిలో కూడా ఆ ఐటెం సాంగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే రెజీనా ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించినట్లుగా రెజీనా చెప్పుకొచ్చింది.

chiru

మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అనడం వల్ల నేను ఒప్పుకున్నానని.. చిరుతో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటానని చెప్పింది రెజీనా. ఆ పాటలో చిరంజీవిగారి డ్యాన్స్ తనలో స్ఫూర్తిని నింపిందని తెలిపింది. ఈ పాటలో తన డ్యాన్స్ ను చిరంజీవి మెచ్చుకున్నారని… ఆయన నుంచి అభినందనలు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని రెజీనా పేర్కోంది. ఆచార్య సినిమాలో చేసింది ఐటెమ్ సాంగ్ కాదంటూ దాన్ని అలా పిలవొద్దని, సెలబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది. ఇక ఇలాంటి స్పెషల్ సాంగ్‌లో మరోసారి నటించనని.. ఇదే చివరిసారి కూడా అని పేర్కోంది.

- Advertisement -