- Advertisement -
యూత్ ఫుల్ హీరో నిఖిల్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో కార్తీకేయ 2 చిత్రం ఇటీవలే తిరుపతిలో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి కార్తికేయ2 షూటింగ్ ని మొదలుపెట్టడానికి లొకేషన్స్ రెక్కీని ప్రారంభించారు దర్శకుడు చందుమొండేటి, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని. దీనికి సంబంధించిన ఫొటోలను, తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు పిపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాకత్మంగా నిర్మిస్తున్నాయి. ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ కు టీ.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు.
- Advertisement -