కరోనాపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి: ఈటల

414
etela rajender
- Advertisement -

కరోనాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి ఈటల రాజేందర్. హోమియోపతి మెడికల్ కాలేజీలో వ్యాధినిరోధక శక్తిని పెంచేదుకు ఆయుష్ ద్వారా పంపిణీ చేస్తున్న హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వ్యాప్తి చెందడంలో వేగంగా ఉన్నప్పటికీ ..డెత్ రేట్ చాలా తక్కువ అన్నారు…

కరోనా పై నెగిటివ్ ప్రచారం ఎక్కువ జరుగుతుంది…అసత్య ప్రచారం చూస్తే చాలా భాద అనిపిస్తుందన్నారు. గాంధీ లో ఐసోలేషన్ వార్డు లో వసతులు సరిగా లేవు అని జూనియర్ డాక్టర్లు చెప్పినట్లు గా ప్రచారం జరుగుతోంది..కానీ ఇందులో నిజం లేదన్నారు.

సాహాసం చేసే అవకాశం అందరికీ దొరకదు…కరోనా కోసం జిల్లా ల నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్లే మాస్క్ లు వేసుకుని తిరుగుతే జనాల్లో ఇంకా భయం పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఒక్క వ్యక్తి కి కూడా కరోనా వైరస్ సొకలేదని..దుబాయ్ ఇతర దేశాలు తిరిగిన వారికి కరోనా వచ్చిందన్నారు.

ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన భాధ్యత పారామెడికల్ స్టాఫ్ అందరిపై ఉందని ఇంటి దగ్గర నుంచి మీకు వత్తిడి వచ్చినా మనందరికోసం మీరు ,మీ కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసి పనిచేయాలన్నారు.

- Advertisement -