- Advertisement -
ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడికి పాల్పడ్డారు. తాము ఎంపీకి బాగా దగ్గరి వాళ్లం అని చెప్పి కొంత మంది వ్యక్తులు హుమాయిన్ నగర్ రోడ్డులోని తిలక్ మార్గ్ పోలిస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న ఎంపీ అధిర్ రంజన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎంపీ ఇంట్లో ఉన్న సెక్యూరిటి సిబ్బందిపై దాడికి పాల్పడి పలు కీలక పత్రాలకు ఎత్తుకెళ్లారు.
ఎంపికి దగ్గరి వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీకి ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా ఉన్న అధిర్ రంజన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేతగా కొనసాగుతున్నారు.
- Advertisement -