ప్రభాస్ 22 ఫిక్స్ !

411
prabhas
- Advertisement -

సాహో తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్‌ తన 21,22 వ సినిమాలను అనౌన్స్ చేశారు.

21వ సినిమా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనుండగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. సైన్స్‌ ఫిక్షన్ జోనర్‌లో మూవీ ఉండనున్నట్లు సమాచారం.

దీంతో పాటు ప్రస్తుతం టీ టౌన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తన 22వ సినిమాను కొరటాల శివతో చేయనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మిర్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కొరటాలతో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సాహో తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు ప్రభాస్‌.

- Advertisement -