ముంబై రోడ్లపై విజయ్ దేవరకొండ హల్ చల్

437
Vijay Devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు షూటింగ్ లో జాయిన్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా విజయ్ హీరోయిన్ తో కలిసి బైక్ పై చెక్కారు కొడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. బైక్ మీద హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండేని ముందు ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మరో ప్లాప్ ను సొంతం చేసుకున్న విజయ్ ఈమూవీతో ఎలాగైన సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.

- Advertisement -