ఇటీవల సహకార బ్యాంకు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన నూతన పాలకవర్గాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తుంది. 2014 రాష్ట్ర విభజన చట్టాన్నికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు అన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్ళు చేసుకున్నారని అవహేళన చేయడం కిషన్ రెడ్డికి తగదని సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
డిలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకాశ్మీర్ కె వర్తింస్తుందని అనడం విడ్డురమని.. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ ప్రగతి ఎంతో మంచి కార్యక్రమం. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమం ఇది. దీనికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదు. దీనిపై ఒకరిని ఒకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.