మిషన్ భగీరథ పథకంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు చెక్ పెట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసిన కేటీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో అత్యంత సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు.
మిషన్ భగీరథ టీంకు,ఇంజనీరింగ్ అధికారులకు ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లాలో గత ఆరేళ్లుగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు కేటీఆర్.
This is a news that made my day. Feel proud & happy 😊
Vision of Hon’ble CM Sri KCR Garu to provide safe drinking water to all & efficient execution by Mission Bhagiratha team of Engineers & officials has mitigated a serious concern that plagued Nalgonda & other districts 👏 pic.twitter.com/JtLghLPFwA
— KTR (@KTRTRS) February 29, 2020