ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని కన్నబిడ్డల్లా పెంచండి అంటూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటుతూ హీర్ అర్జున్ ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణకు హరితహారం ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను కేవలం రెండు రోజుల్లో సుమారు ఆరు లక్షల మంది చూశారు. మొక్క నాటుతూ సెల్ఫీ దిగిన అర్జున్ అదే సందర్భంగా కేవలం నలభై సెకన్ల నిడివితో అందరికీ ఓ సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం అంటూ, ధర్మో రక్షతి రక్షిత: మాదిరిగానే వృక్షో రక్షతి రక్షత: అంటూ .. చెట్లను మనం రక్షిస్తే, అవే చెట్లు మనకి రక్షణ ఇస్తాయంటూ అర్జున్ కోరారు.
ఈ మేసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కేవలం రెండు రోజుల్లో సుమారు ఐదున్నర లక్షల మంది ఈ వీడియో మెసేజ్‌ను చూడగా, ఐదు వేలా మూడు వందల మందికిపైగా షేర్ చేశారు. అర్జున్ మంచి ప్రయత్నం చేశారని, మిగతా తెలుగు హీరోలు కూడా తమ అభిమానులకు ఇదే రకమైన పిలుపు మొక్కలు నాటాలని ఇవ్వాలంటూ నెటిజన్లు తమ మెసేజ్‌ల ద్వారా కోరారు. అదే సమయంలో గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించి దేశవ్యాప్తం చేసిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అందరూ అభినందించారు.