రూ.48 కోట్లతో దేవరకొండలో అభివృద్ధి పనులు..

353
ktr
- Advertisement -

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. స్ధానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌, రోడ్లు, పార్క్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు.

దేవరకొండలోని 10వ వార్డులో పాదయాత్ర చేసిన కేటీఆర్ ఇంటింటికీ తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్ధానికంగా ఉన్న మిషన్ భగీరథ ట్యాంకును పరిశలించి  నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -