- Advertisement -
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, టాప్ హీరోల పక్కన చాన్స్ కొట్టేస్తూ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన రష్మికా మందన్న, హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. బంజారాహిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రష్మిక, కాసేపు మీడియాతో మాట్లాడింది.
రష్మిక మాట్లాడుతూ.. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, సినిమాలు చేయకుంటే ఫిట్‌నెస్‌కు సంబంధించిన బిజినెస్ చేస్తుండేదాన్నని తెలిపింది. చాలా రోజుల నుండి హైదరాబాద్‌లో ఉంటున్న ఇంతవరకు చార్మినార్ చూడలేదని.. ఏదో ఒక రోజు రాత్రి పూట బురఖా ధరించి అక్కడికి వెళ్తానని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత ఇల్లు కొనుక్కుంటానని, తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని రష్మిక తెలిపింది.
- Advertisement -