భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజినల్ సిరీస్, చదరంగం- ఒక రాజకీయ డ్రామాను ప్రసారం చేయనుంది. శ్రీకాంత్, సునైన్, నాగినీడు, కౌసల్య తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ కింద నిర్మించిన ఈ సిరీస్ రాజ్ దర్శకత్వం వహించగా, జీ5లో మాత్రమే ప్రత్యేకంగా ఫిబ్రవరి 20 ప్రదర్శించబడుతుంది.
మంచు విష్ణు మాట్లాడుతూ…ఇది ఎన్టీరామారావు అప్పట్లో జరిగిన రాజకీయ ప్రస్థానంలో చిన్న ఎపిసోడ్ తీసుకుని ఇప్పటి సిట్యూయేషన్‌కి లింక్ చేస్తూ చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నాన్న చాలా చాలా చెప్పారు. చాలా జాగ్రత్తగా తీయవలసిన చిత్రమిది అని. అలాగే వాస్తవాలను ప్రజలకు చూపించు అని చెప్పారు. ఈ కథ నాదగ్గరికి రాగానే ముందు నేను పరుచూరి గాపాలకృష్ణ ని అడిగాను. ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా అని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చూపిస్తాను. కొంత ఫిక్షన్ కలిపి తీయాలనుకుంటున్నా అన్నా ఆయన కూడా సరే అని హెల్ప్ చేశారు. ఇంకా దీని కోసం జీ5 వారు మరియు ఇందులో నటించిన ఆర్టిస్ట్‌లు అందరూ కూడా చాలా తమ సహాయ సహకారాలని అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాను. ఫ్యూచర్ మొత్తం డిజిటల్‌దే అని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ… ఈ వెబ్‌సిరీస్‌కి మా సినిమా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. దీని విలువ పెరుగుతుంది. అతి త్వరలో చాలా మంది సినిమా పెద్దలు కూడా ఇందులో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు విష్ణు తో మోహన్‌బాబు ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తే బావుంటుందని చెప్పాను. కాని అది కుదరలేదు. కాని ఆ స్థానంలో చేసిన శ్రీకాంత్ అద్భుతమైన నటనను కనబరిచారు. హీరో శ్రీకాంత్ నటించిన ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. ఈ సినమాలో నా పాత్ర కూడా ఉంటుంది. అది నా ఒరిజినల్ పాత్ర ఇది చాలా తక్కువ మందికి తెలుస్తది. అప్పటి తరానికి తప్ప ఇప్పటి వాళ్ళకి తెలియదు. అప్పటి కథకి ఇప్పటి సిట్యూషన్స్ కలిపి చేశారు. నా ప్రతిఘటన సినిమాలో నేను చెప్పిన రాజకీయ మీనింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని ప్రతిబింబిచేలాగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ `చదరంగం` పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ…నేను ఎక్కడా పని చెయ్యలేదు. ఇతను కథ తీసుకువెళ్ళగానే విష్ణు ఓకే అన్నాడు. మొదట శ్రీకాంత్ ఈ చిత్రంలో నటించడానికి కొంచం ఆలోచించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లు అవసరమా అనుకున్నారు. విష్ణు కన్విన్స్ చేయడం వల్ల శ్రీకాంత్ చేయడానికి ఒప్పుకున్నారు. చాలా బాగా నటించారు. ఇది ఆల్రెడీ తమిళ్‌లో పెద్ద హిట్ అయింది. తెలుగులో 20 వ తారీఖున అవుతుంది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నారు.