ఘనంగా సురేఖ బర్త్ డే సెలబ్రేషన్స్‌..

351
ram charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బర్త్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. భార్య ఉపాసనతో కలిసి పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశారు.

సురేఖతో కేక్ కట్ చేయించడంతో పాటు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. ఈ సంధర్భంగా చరణ్, ఉపాసన ఆమె దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది.

ఓ వైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ . ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న రామ్ చరణ్‌ మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమాకు నిర్మాతగా అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -