క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. కొద్ది రోజులుగా ఆమె చెన్నైలో నివాసం ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పలువురిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తుంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి అందిరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా మరోసారి అభిరామ్ గురించి మాట్లాడింది శ్రీరెడ్డి.
నిర్మాత సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియోను ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని స్టూడియోను వైజాగ్ కు తరలించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విషయంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఎక్కడైతే నాకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ స్టూడియోను త్వరలో కూల్చేయబోతున్నారు అని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్ మరోసారి వైరల్ గా మారింది. అంతేకాకుండా కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేష్ లను కూడా బండ బూతులు తిట్టింది.