ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేసే సీఎం కేసీఆర్ మంచి ఆరోగ్యంతో ఇంకా 34 ఏళ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా,దేశ ప్రధానిగా పనిచేయాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయాలనేది సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన అధికారిక నివాసంలో మొక్కలు నాటిన వేముల …హరితహారం ద్వారా తెలంగాణ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి,వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తనకు దైవ సమానులైన సీఎం కేసీఆర్ 66వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని చెప్పిన మంత్రి….ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని…తమ అభిమాన నేత నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.