కాళేశ్వరంతో కోనసీమగా వరంగల్‌: ఎర్రబెల్లి

357
minister errabelli
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుతో వరంగల్ కోనసీమలాగా మారిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ అర్బన్ జిల్లా మండికొండలో టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వరంగల్‌కు మరో ఐటీ కంపెనీ రావడం గర్వకారణమని అన్నారు. వరంగల్‌లో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు.

వరంగల్‌ ప్రజల పక్షాన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి.. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. ఐటీ రంగానికి వరంగల్‌ అనువైన పట్టణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, ధర్మారెడ్డి, ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -