- Advertisement -
వరుస సినిమాలతో తెలుగు, తమిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఓరియెంటెడ్ మూవీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్న నయన్ ఓ వైపు తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి ఖాళీ టైములో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఫారెన్ టూర్లకు వెళ్లిన ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కూడా. అయితే ఈ ప్రేమ జంట ప్రేమ కథ మొదలై ఐదేళ్లు అయ్యిందట.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు విఘ్నేశ్ శివన్. ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమకథను వివరిస్తూ.. మా ఇద్దరి కథ మొదలై ఐదేళ్లు అయ్యిందని వెల్లడించాడు. నయనతారతో ప్రతి రోజు తనకు వాలెంటైన్స్ డేగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
- Advertisement -