పవన్ కోసం సామజవరగమన రిపీట్..!

429
pawan
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో ఆల్ టైం హిట్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక పాటల గురించి చెప్పాల్సిన పనిలేదు. సామజవరగమన, రాములో రాములా అంటూ విడుదల చేసిన సాంగ్స్‌ యూ ట్యూబ్‌ని షేక్ చేశాయి. ముఖ్యంగా సామజవరగమన అంటూ సాగే సాంగ్‌కు తమన్ సంగీతం అందించగా సిద్ శ్రీరామ్‌ పాడిన ఈ పాట సంగీత ప్రియులను అలరించింది.

తాజాగా ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుంది. దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

పవన్‌ -తమన్ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు తమన్. అల వైకుంఠపురముతో మ్యాజిక్ చేసిన తమన్ ఈ సినిమాకు కూడా సామజవరగమన లాంటి సూపర్ హిట్ సాంగ్‌ని అందించేందుకు సిద్ధమయ్యాడు. అంతేగాదు ఆ పాటని కూడా సిద్ శ్రీరామ్‌తో పాడించాలని భావిస్తున్నారట. మొత్తంగా ఇప్పటికే పవన్‌ రీ ఎంట్రీ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా తమన్ అందించే సంగీతం సినిమాకు మరింత ప్లస్ కానుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

- Advertisement -