పవన్‌కు జోడీగా ఇస్మార్ట్‌ బ్యూటీ..!

555
- Advertisement -

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్‌ కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు నాగచైతన్య సవ్యసాచి, అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల ద్వారా యూత్ హృదయాలను దోచేసిన ఈ సుందరి, ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె మరో అవకాశాన్ని దక్కించుకుంది. క్రిష్ సినిమాలో కథానాయికగా ఆమె ఎంపిక జరిగిపోయిందని తెలుస్తోంది.

pawan

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా PSPK 27 భారీ బడ్జెట్‌తో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌ సరసన హీరోయిన్‌గా కైరా అద్వానీని .. పూజా హెగ్డేను .. సోనాక్షి సిన్హాను సంప్రదించారట. అయితే వాళ్ల డేట్స్ ఖాళీ లేకపోవడం వలన, పారితోషకం భారీగా ఉండడంతో నిధి అగర్వాల్ ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ అమ్మడు పారితోషికం తక్కువ కావడం వల్లనే తీసుకున్నారని సినీవర్గాల టాక్.

- Advertisement -