ఆ వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడుః యాంకర్ రవి

399
Anchor Ravi
- Advertisement -

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. తనదైన మాటలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యాంకర్ రవి తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తి తన వద్ద నుంచి రూ.45లక్షలు అప్పుగా తీసుకున్నాడని..డబ్బులు ఇవ్వమని అడిగితే కొంత మంది గుండాలతో తనను బెదిరిస్తున్నాడని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు చేశాడు యాంకర్ రవి.

కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు వెనక్కి ఇచ్చాడని, ఇంకా కొంత సొమ్ము రావాల్సి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవి పేర్కొన్నాడు. అయితే మిగతా డబ్బులు అడిగతే బెదిరిస్తున్నాడని తెలిపాడు. దాంతో పాటు తాను ఎక్కడికి వెళ్లినా కొంత మంది మనుషులను పంపించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కోన్నాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలిసిందన్నాడు. రవి ఫిర్యాదు మేరకు సందీప్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -