- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్ రావు మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్ను మూశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్ లోని మంగాపురికి చేరుకుని రాజేశ్వర్ రావు పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. శనివారం ఉదయమే మంగాపురికి చేరుకుని, రాజేశ్వర్రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. పర్వతనేని రాజేశ్వర్రావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్ల గ్రామం. కాగా సాయంత్రం అల్వాల్ రాజేశ్వర్ రావు అంత్యక్రయలు జరుగనున్నాయి.
- Advertisement -