- Advertisement -
హైదరాబాద్ బిర్యాని ఎంత ఫేమసో అందరికి తెలుసు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులు హైదరాబాద్ వస్తే…ఇక్కడి బిర్యానీ రుచి చూడాల్సిందే.
అయితే నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కేరళలోని పారిస్ రెస్టారెంట్లో దొరికే ఫిష్ బిర్యానీ ముందు మిగిలినవన్నీ తక్కువే అంటూ ట్వీట్ చేశారు.
అందుకు స్పందించిన కేటీఆర్ అమితాబ్ జీ నేను కచ్చితంగా చెప్పగలను హైదరాబాద్ బిర్యా నీతో మిగిలిన వేటిని పోల్చలేమని ట్విట్ చేశారు. హైదరాబాద్ బిర్యానీని మిగిలివన్నీ అనుకరించినవేనని…. రుచికరమైన వంటకాలలో హైదరాబాద్ సిటీని యునెస్కో బెస్ట్ సిటీగా ఎంపికచేసిందని గుర్తుచేశారు.
- Advertisement -