పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మరోసారి సెటైర్లు వేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన మోడీ… ట్యూబ్లైటు తరహాలో రాహుల్ గాంధీ నిదానంగా స్పందిస్తారని అన్నారు.
ప్రధాని మాట్లాడుతున్నప్పుడు రాహుల్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలేదని, ప్రధాని మోడీని యువత కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు మోడీ ధీటైన సమాధానం ఇచ్చారు.
ఆర్నెళ్లల్లో మోడీదీని యువత కొడుతారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, అయితే రాబోయే ఆర్నెళ్లు సూర్యనమస్కారాలు చేసి వెన్నును దృఢంగా మార్చుకుంటానని, అప్పుడు మీరు ఎంతైనా కొట్టవచ్చు అన్నారు. 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతుంటే.. రాహుల్కు అర్థం కావడం లేదా.. కొన్ని ట్యూబ్లైట్లు ఇంతే ఉంటాయని చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభ్యుల నవ్వులతో కాంగ్రెస్ నేతల మొఖాలు తేలిపోయాయి.