గత బడ్జెట్ లో 1,56,352 కోట్లు కేటాయిస్తే…ఈ ఏడాది 2020-21లో 1,61,042 కోట్లు కేటాయించారని చెప్పారు రైల్వే జీఎం గజానన్ మాల్యా. రైల్వే బడ్జెట్ పై రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడిన గజానన్…గత బడ్జెట్ తో పోల్చితే ఈ ఏడాది 3శాతం అదనపు నిధులు కేటాయించారని చెప్పారు.
ఈ బడ్జెట్ లో భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చారని..2020-21 ఏడాదిలో మౌలిక సదుపాయాల కల్పనకోసం 6, 846 కోట్లు కేటాయించారని చెప్పారు. డబ్లింగ్, మూడవ లైన్ , బైపాస్ లైన్ పనుల కోసం 3,836 కోట్లు కేటాయించారని వెల్లడించారు. కొత్త లైన్లు ఇతరత్రా వ్యయాల కోసం 2,856 కోట్లు కేటాయించారని..ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు 40 కోట్లు కేటాయించారని చెప్పారు.
చర్లపల్లి సాటిలైట్ టర్మీనల్ స్టేషన్ కు 5 కోట్లు కేటాయించారని..మనోహరబాద్-కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టు కోసం 235 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. మునిరాబాద్-మహబూబ్ నగర్ కొత్త లైన్ ప్రాజెక్టు కోసం రూ.240 కోట్లు…భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైన్ ప్రాజెక్టు కోసం రూ. 520 కోట్లు…కాజీపేట-బల్లార్ష 3వ లైన్ ప్రాజెక్టు కోసం రూ.483 కోట్లు కేటాయించారని చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త ప్రాజెక్టు కోసం రూ.1198 కోట్లు…విశాఖ రైల్వే జోన్ కు రూ.170 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. గుంటూరు-లింగంపల్లి,ఔరంగబాద్-పన్వెలి,చర్లపల్లి-శ్రీకాకులం రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు రాబోతున్నాయి
చర్లపల్లి-వారణాసి
లింగంపల్లి-తిరుపతి
చర్లపల్లి-పర్వేలి
విజయవాడ-విశాఖపట్టణం
చర్లపల్లి-శాలిమార్
ఔరంగబాద్-పన్వెలి
సికింద్రాబాద్-గౌహతి
చర్లపల్లి-చెన్నయ్
గుంటూరు-లింగంపల్లి