ఇక సెలవు…విజయశాంతి కీలక ట్వీట్

456
vijayashanthi
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు సినిమాతో దశాబ్దం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విజయశాంతి. సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ ముందు వచ్చిన ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా విజయశాంతి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఈ మూవీ తర్వాత విజయశాంతి నటించబోయే సినిమాలపై రకరకాల వార్తలు వెలువడుతుండగా ఆసక్తికర ట్వీట్ చేసింది. సరిలేరు మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు,అభిమానులకు ధన్యవాదాలు. నా నట ప్రస్ధానంలో కళ్లుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు(1979) నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం…మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం కల్పిస్తుందో లేదో తెలియదు..ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు,నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

- Advertisement -