సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

788
Telangana PACs Electionsq
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయింది. జిల్లాలోని ఆయా సంఘాల ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 906 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న స్క్రూట్నీ జరగనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరగనుంది.

- Advertisement -