- Advertisement -
జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, జెడ్చేర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయమని,వారు భావితరాలకు మార్గదర్శకులు అని ఆయన కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఎంపీ సంతోష్ లక్ష్యం పదికోట్ల మొక్కలు నాటే వరకు కృషి చేయాలని నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా వంతుగా నేను మొక్కలు నాటి, వేరే వాళ్ళని భాగస్వామ్యం చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. మొక్కలు నాటడం కాదు, అవి ఎదిగేందుకు కావల్సిన వనరులను సమకూరుస్తానని తెలిపారు. వారితో సినిమా ఇండస్ట్రీలో గ్రీన్ ఛాలెంజ్‌లో ముఖ్య పాత్ర పోషించిన కాదంబరి కిరణ్, లక్ష్మణ్ పీఏ భాస్కర్‌లు పాల్గొన్నారు.
- Advertisement -