తెలంగాణ క్రీడా శాఖలో జాతీయ క్రీడా ప్రణాళిక

314
minister srinivas goud
- Advertisement -

జాతీయ క్రీడా ప్రణాళిక ను తెలంగాణ క్రీడా శాఖలో తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనెజింగ్ డైరెక్టర్ ను అదేశించారు. కేంద్ర క్రీడా శాఖ క్రీడా అభివృద్ది ప్రణాళికలో భాగంగా  జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ క్రీడా శాఖ అమోదం తెలుపుతూ  మెమో నెంబర్ 2578 ను విడుదల చేసిందన్నారు.

తెలంగాణ క్రీడా అభివృద్ది ప్రణాళికలో భాగంగా మంత్రి శ్రీనినాస్ గౌడ్   క్రీడా సంఘాల పాలన వ్వవహారాల మెరుగుపరిచేందుకు సమీక్ష ను నిర్వహించారు. ఈ సమీక్ష లో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న వివిధ క్రీడా సంఘాల , సమాఖ్య ల పనీతీరు పై చర్చించారు. జాతీయ క్రీడా ప్రణాళిక – 2011 లో నిర్ణయించిన మార్గదర్శకాల అమలులో భాగంగా క్రీడా సంఘాల, సమాఖ్య ల కాల పరిమితి, సభ్యుల వయే పరిమితి తగ్గింపు పై క్రీడా శాఖ ఉన్నతాధికారులకు అదేశాలు జారీచేశారు.

క్రీడా సంఘాల లో కీలక పదవులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి , కోశాధికారి లాంటి పదవుల కు ఎంపికయ్యే సభ్యుల వయే పరిమితి 70 సంవత్సరాల లోపు ఉండాలని క్రీడా శాఖ అధికారులకు సూచించారు . క్రీడా సంఘాలలో పరిపాలన వ్యవహరాలు,  మెరుగైన పనీతీరు, జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా క్రీడా సంఘాలు పనిచేయాలని మంత్రి .శ్రీనివాస్ గౌడ్ సూచించారు.  క్రీడా సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి క్రీడా శాఖ అధికారులకు అదేశాలు జారీ చేశారు.

- Advertisement -