మహాత్మునికి ఘన నివాళి…

590
mahatma gandhi
- Advertisement -

మహాత్మాగాంధీ పేరు కాదు ఓ మార్గం. విశ్వాసం,కార్యాచరణ,ప్రజాకర్షణ అనే మూడింటిని తన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని ప్రజల మన్ననలు పొందిన మహానీయుడు మహాత్మ గాంధీ. ఓ వైపు స్వాతంత్ర్య పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయ వేత్త. మార్పు కోసం సాగే పోరులో నీతి,అహింస,ప్రజాస్వామ్య హక్కులు ముఖ్యమని చాటిచెప్పిన నిరాండబరుడు గాంధీ. ప్రపంచ వ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలతో స్పూర్తి పొందిన మహానీయులు ఎందరో.

ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద తెలంగాణ గవర్నర్ తమిళిసై, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,సీఎస్ సోమేశ్ కుమార్ నివాళులు అర్పించారు.

అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచిన జాతిపిత. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం.

బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. అందుకే మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.

- Advertisement -