నేచురల్ స్టార్ నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫరెంట్‌గా చూపించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆవిష్కరిస్తున్నారు. అలాగే సుధీర్‌బాబుతో `సమ్మోహనం` వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈసారి సుధీర్‌ను పవర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్రకు ధీటుగా ఉండే మరో పవర్‌ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలువనున్నాయి.
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సోమవారం సుధీర్‌బాబు లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ మంగళవారం నేచురల్‌స్టార్ నాని లుక్‌ను విడుదల చేయనుంది. నాని నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిలర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి25న విడుదల చేస్తున్నారు.
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి తదితరులు.. సాంకేతిక వర్గం: మ్యూజిక్: అమిత్ త్రివేది, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.