- Advertisement -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు.
అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం అనంతరం మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిపారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.
- Advertisement -