లేడి డైరెక్టర్ తో మెగా హీరో

448
vaishnav-
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు ఉప్పెన అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఏప్రిల్ లో ఈమూవీ విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీకి సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

nandini_director

కాగా ఈ హీరో తాజాగా మరో సినిమాను ఓకే చేశాడు. లేడి డైరెక్టర్ నందిని రెడ్డితో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు వైష్ణవ్ తేజ్. నందినిరెడ్డి సమంతతో ఓ బేబి సినిమాతో విజయం సాధించింది. దీంతో ఇక ప్రస్తుతం నందిని రెడ్డి, వైష్ణవ్ తేజ్‌తో తన సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తోంది. ఈ తాజా చిత్రం ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాను స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్రయూనిట్.

- Advertisement -