- Advertisement -
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆహ్వానించారు. ఎంపీ మాలోతు కవిత, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు, ఆలయ ఈవో రాజేంద్రం, ఆలయ ట్రస్టు చైర్మన్ రామ్మూర్తి, ప్రధాన పూజారి జగ్గారావు, ఇతర పూజారులు, ఆలయ పాలకమండలి సభ్యులతో పాటుగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
- Advertisement -