మాతాశిశు సంరక్షణే ధ్యేయం: మంత్రి ఈటల

271
etela
- Advertisement -

మాతాశిశు సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో టైమ్స్ ఫర్టిలిటీ&గైనకాలజీ కాంక్లేవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల మనిషి టెక్నాలజీ, సైన్స్, అంతస్థుల మోజులో పడి స్ట్రెస్ కు గురవుతున్నాడని చెప్పారు.

స్ట్రెస్ కు గురయ్యి, ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారన..గతంలో 9 మందిలో ఒకరికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తే.. ఇపుడు 4 లో ఒకరికి వస్తుందన్నారు. ఒకప్పుడు పిల్లలనే సంపదగా భావిస్తే.. ఇప్పుడు ఒకరిద్దరకంటే ఎక్కువ వద్దనుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఫర్టిలిటీ అవసరం పెరిగిన నేపథ్యంలో సెంటర్స్ ను లాంచ్ చేస్తున్నారని చెప్పారు. ఫర్టిలిటీ అవసరం గుర్తించి గాంధీ లో కూడా ఫర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. కేసీఆర్ కిట్ ప్రారంభించాకా .. గర్భిణీ లు డెలివరీకి హాస్పిటల్ కే వస్తున్నారన్నారని చెప్పారు.

- Advertisement -