డిస్కోరాజా…ట్విట్టర్ రివ్యూ

461
raviteja
- Advertisement -

అమర్ అక్బర్ ఆంటోని తర్వాత మాస్ మహారాజా రవితేజ చేసిన చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించగా బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది డిస్కోరాజా.

సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రీమియర్‌ షో చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోండగా ఇది డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు.

రవితేజ కొత్త అవతారంలో అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుందని సునీల్‌ పాత్ర సినిమాలో కీలకం అని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. ఓవరాల్‌గా డిస్కోరాజాతో రవితేజ హిట్టు కొట్టినట్టేనని చెబుతున్నారు.

- Advertisement -