సిద్దిపేట జిల్లా నాగులబండ వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ జీఎన్‌రావు, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథిలకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కంటి సమస్యలు లేకుండా చేయడం కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని అందరూ వినియోగించుకోవాలని కోరారు.
పేదలకు తక్కువ ధరకే మందులను అందిస్తున్న హెటిరో డ్రగ్స్ సంస్థపై ప్రశంసలు గుప్పించారు హరీష్. సమాజానికి, పేదవారికి సేవ చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందన్నారు. కార్పొరేట్ స్థాయి కంటి వైద్యం ఇక్కడ లభిస్తుందన్నారు. అదేవిధంగా పేద ప్రజలకోసం రూ.400 కోట్లతో పార్థసారథి క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మిస్తున్నరని.. సిద్దిపేటలో సైతం క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు.