అల…సరిలేరు మీకెవ్వరు

447
trivikram
- Advertisement -

సంక్రాంతి రేసులో వచ్చినా రెండు పెద్ద సినిమాలు సరిలేరు నీకెవ్వరు,అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరుతో మ్యాజిక్ చేశాడు మహేష్. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ మూవీల్లో ఒకటిగా ఈ సినిమా నిలవగా కామెడీ,డైలాగ్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో కూడా సంక్రాంతి శోభను తీసుకొచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలు కలిపి మొత్తం రూ. 200 కోట్లను వసూలు చేశాయంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల నటులు సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడితో మహేష్‌..త్రివిక్రమ్‌తో బన్నీ హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిక్చర్ పర్‌ఫెక్ట్..ఈ కాంబో మళ్లీ రిపీట్ కావాలంటూ నెటిజన్లు పోస్టు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -