భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 36 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. ఈ రోజు జరుగుతోన్న మ్యాచ్‌లో గెలిచిన వారికే కప్ దక్కుతుంది.
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరే (వికెట్ కీపర్), యాష్టన్ టర్నర్, యాష్టన్ అగర్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్, ఆడమ్ జంపా