బాలీవుడ్‌ హీరోతో పూజ హెగ్డే ప్రేమాయణం..!

633
Pooja Hegde
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్‌తో ముకుందా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజా హెగ్డే, డీజే సినిమాతో పాపులర్ అయ్యింది. డీజే, అరవింద సమేత, మహర్షి, వాల్మీకి చిత్రాలతో ఇప్పటికే తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ అందాల భామ తాజాగా గత వారం విడుదలైన అల వైకుంఠ‌పుర‌ములో న‌టించి త‌న గ్లామ‌ర్్‌తో సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, ఈ భామ ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది.

pooja

గత సంవత్సరం హిందీలో వచ్చిన ‘బజార్’ చిత్రంతో పాప్యులర్ అయిన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ప్రేమలో పడిందని సినీ వర్గాలు అంటున్నాయి. పూజా రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరీ ఈ విషయంలో నిజమెంత, అబద్ధమెంత? అనే విషయం తెలియాలంటే మాత్రం వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరవాల్సిందే. ప్రస్తుతం పూజ ప్రభాస్ , అఖిల్‌ సినిమాలతో బిజీగా వుంది.

- Advertisement -