- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్ ఐపీఎస్ అధికారి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చొరవ అద్భుతమైనది అన్నారు.
భవిష్యత్ తరాలకు చక్కటి గాలిని, మంచి వాతావరణం ఉండాలి అంటే మనం చెట్లు నాటడం అలవాటు చేసుకోవాలి. నాటిన ప్రతి మొక్కను కాపాడాలి అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
- Advertisement -