- Advertisement -
వెన్నెముక గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత ఏ జట్టు ఎంపికకు ఒక రోజు ముందు ఫిట్ నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు హార్దిక్.
బోర్డు నిబంధనల ప్రకారం తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా శనివారం జరిగిన పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దీంతో భారత్ ‘ఎ’ జట్టులో పాండ్యా స్ధానంలో మరో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఇటీవలే గాయం నుంచి కొలుకున్న హార్ధిక్ కివీస్ టూర్ కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అతనిపై నమ్మకం ఉంచి మైదానంలోకి దిగకపోయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేశారు సెలక్టర్లు కానీ ఫిట్నెస్ ఫెయిల్ అయి పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.
- Advertisement -