పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం ఓ భారీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఒకే వేదికపై కనపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉంది. అలాగే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొంటారని సమాచారం.
ఆదివారం ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. పోర్టు ట్రస్ట్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని ఇప్పటికే ప్రకటన వెలువడింది. పోర్టు వార్షికోత్సవాలకు మమత బెనర్జీని కూడా ఆహ్వానించారు.
అయితే మమత బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మోదీ, మమత ఒకే వేదికపై కనిపిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.