వింగ్స్ ఇండియా 2020..సన్నాహాక సమావేశం

535
ktr wings india 2020
- Advertisement -

హైదరాబాద్ ప్రపంచస్ధాయి వైమానిక సదస్సుకు వేదికకానున్న సంగతి తెలిసిందే. మార్చిలో బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్ ఇండియా 2020 సదస్సు సన్నాహాక సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సన్నాహక సమావేశంలో పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 12 నుంచి 15 వరకు బేగంపేట విమానాశ్రయం వేదికగా ఈ ‘వింగ్స్ ఇండియా-2020’ కార్యక్రమం జరగనుంది.

wings india 2020

- Advertisement -