ముగిసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం

427
krishna river board
- Advertisement -

కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కాసేపట్లో త్రి సభ్య కమిటీ సమావేశం జరుగనుండగా రెండు రాష్ట్రాలకు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయనుంది కృష్ణా బోర్డు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయమై చర్చించామని కృష్ణా బోర్డు ఛైర్మన్ ఆర్.కె.గుప్తా తెలిపారు.

యధావిధిగా 66:34 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తాం అని..వరద సమయంలో వినియోగించుకున్న ఎక్కువ నీటి విషయమై కూడా సమావేశంలో చర్చించాం అన్నారు. తెలంగాణ లెవనెత్తుతోన్న అదనపు 45 టీఎంసీలు, గృహవినియోగ జలాలను 20శాతం పరిగణలోకి తీసుకోవాలన్న అంశాలను సీడబ్ల్యూసీకి నివేదిస్తాం అన్నారు గుప్తా.

- Advertisement -