పురపోరులో గెలుపు టీఆర్ఎస్‌దే: తలసాని

321
talasani
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని..టీఆర్ఎస్‌కు ఏ పార్టీతో పోటీ లేదన్నారు. టీఆర్ఎస్‌లోనే గట్టిపోటీ ఉందని టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని నామినేటెడ్ పోస్టులతో వారికి న్యాయం చేస్తామన్నారు.

పార్టీలో 60 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయని…అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.పట్టణాల్లో మౌళిక సదుపాయాలు మరింత మెరుగుపర్చేందుకు అధిక నిధులు కేటాయిస్తామన్నారు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -