గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన డీసీపీ

320
dcp green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో డిసిపి కె నారాయణరెడ్డి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ఇందులో తనను భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ ఏడాది లో పోలీసు డిపార్ట్మెంట్ నుడి హరితహారం లో ఎక్కువ మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.

బ్రెజిల్ లో ని అమేజాన్ ఫారెస్ట్, ఆస్ట్రైలియా లోని న్యూ సౌత్ వేల్స్ లో బుష్ ఫైర్ కారణముగా అడవులు నశించి పోవడం వల్ల జంతువులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట అడవులను పెంచవలిసిన అవసరం చాలా ఉందని గాలి కాలుష్యం వల్ల మనకు భవిష్యత్ లో ఆక్సిజన్ దొరకడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతిఒక్కరు ఈ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ అవి చెట్టులా ఎదిగేలా బాద్యత తీసుకోవాలన్నారు. తాను ఇంకో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని అనుకరించేలా చేస్తానని… వాళ్ళు కూడా మూడు మొక్కలు నాటే విధంగా చూస్తానని తెలిపారు.

- Advertisement -