హైదరాబాద్‌లో అటవీ శాఖ (పరిశోధన అండ్ అభివృద్ది విభాగం), నెహ్రూ జూ పార్క్ అధికారులు వేర్వేరుగా రూపోందించిన క్యాలెండర్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో ఆవిష్కరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా, సంవత్సరంలో ఒక్కో మాసంలో మాత్రమే పూసే ఒక్కో రకమైన పూల మొక్కలతో కూడిన క్యాలెండర్‌ను అటవీ అండ్ అభివృద్ది శాఖ ప్రత్యేకంగా ఈ క్యాలెండర్‌ను రూపోందించింది.
అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు రూపొందించిన క్యాలెండర్‌ను మంత్రి విడుదల చేశారు. జూ పార్క్‌లో జంతువుల ఫోటోలతో ఆకర్షణీయంగా క్యాలెండర్ రూపొందింది. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభా, సీయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ మునీంద్ర, అదనపు పీసీసీఎఫ్ లు దొబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, లోకేష్ జైస్వాల్, కుక్రేటి, ఫర్గెయిన్, జూ పార్క్ క్యురేటర్ క్షితిజ, తదిరులు పాల్గొన్నారు.